News March 17, 2025
రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపు విడుదల కానున్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి జూన్ నెల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని TTD వెల్లడించింది. ఈ టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18, 19, 20వ తేదీల్లో ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని వివరించింది. అధికారిక వెబ్సైట్ను ఉపయోగించాలని సూచించింది.
Similar News
News March 18, 2025
మార్చి18 : చరిత్రలో ఈ రోజు

*1922: శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు మహాత్మాగాంధీకి 6 సంవత్సరాల జైలుశిక్ష
*1938: బాలీవుడ్ నటుడు శశి కపూర్ జననం
*1953: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ జననం
*1965: అంతరిక్షంలో నడిచిన తొలి రోదసీ యాత్రికుడిగా అలెక్సీ లియనోవ్ రికార్డు
*1986: సినీనటుడు సుశాంత్ జననం
News March 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 18, 2025
శుభ ముహూర్తం (18-03-2025)

☛ తిథి: బహుళ చవితి సా.7.02 వరకు తదుపరి పంచమి ☛ నక్షత్రం: స్వాతి మ.2.52 వరకు తదుపరి విశాఖ☛ శుభ సమయం: లేదు ☛ రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు ☛ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు ☛ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12వరకు రా.10.48నుంచి 11.36 వరకు ☛ వర్జ్యం: రా.9.07నుంచి10.53వరకు☛ అమృత ఘడియలు: ఉ.6.59వరకు