News September 23, 2025

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఆరంభం

image

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకలో భాగంగా ఆలయానికి నైరుతి దిశలో ఉన్న పుట్ట మట్టిని సేకరించి, అందులో నవధాన్యాలను నాటుతారు. బుధవారం సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. ఈ ఉత్సవాలపై ఉపగ్రహ నిఘా ఉంటుందని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు.

Similar News

News September 23, 2025

మైథాలజీ క్విజ్ – 14

image

1. రామాయణంలో ‘వాలి’ కుమారుడు ఎవరు?
2. వ్యాసుని ద్వారా దాసి కన్న బిడ్డ ఎవరు?
3. అత్రి మహాముని భార్య ఎవరు?
4. కామాఖ్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రీరామనవమి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు
<<-se>>#mythologyquiz<<>>

News September 23, 2025

మండలి నుంచి వైసీపీ వాకౌట్

image

ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అట్రాసిటీ కేసులపై చర్చ సందర్భంగా ‘మాపై గొడ్డలి వేటు, కోడికత్తి, అమ్మా, చెల్లి కేసులు లేవు’ అని హోం మంత్రి అనిత YCPపై సెటైర్లు వేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ YCP ఎమ్మెల్సీలు బయటికి వెళ్లిపోయారు.

News September 23, 2025

సన్నబియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు

image

TG: రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంచులను తయారు చేయించింది. ‘రేషన్ కార్డుపై అందరికీ సన్నబియ్యం.. ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే కొటేషన్‌ను ముద్రించింది. CM రేవంత్, Dy.CM భట్టి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఫొటోలతో వీటిని రూపొందించింది. ఈ బ్యాగుల్లోనే బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేయనుంది. ఇప్పటివరకు వస్తున్న గోనె సంచులు ప్రస్తుతానికి ఆగిపోనున్నాయి.