News October 3, 2024

రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఇవాళ అంకురార్పణ

image

AP: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇవాళ రాత్రి 7-8 గంటల మధ్య అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాలకు భారీగా భక్తులు రానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. రేపు రాత్రి సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వీఐపీ దర్శనాలు, ఆర్జిత సేవలను TTD రద్దు చేసింది.

Similar News

News October 3, 2024

విరాట్ ఓ గొప్ప ఆటగాడు: హర్భజన్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ దాదా ప్లేయర్ అని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసించారు. ‘విరాట్ ఓ గొప్ప ఆటగాడు. మెగా టోర్నీలు, ఫైనల్స్‌లో ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు. గత టీ20 వరల్డ్ కప్‌లో కూడా మంచి ప్రదర్శనే చేశారు. టీ20 ఫార్మాట్‌లో ఆయనకు పరుగులు ఎలా రాబట్టాలో బాగా తెలుసు’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

News October 3, 2024

వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చడం దురదృష్టకరం: వెంకటేశ్

image

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని ఎంతో బాధేసిందని హీరో విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ, ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్నా. సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు’ అని పేర్కొన్నారు.

News October 3, 2024

మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ పార్టీ చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నమామి గంగ ప్రాజెక్టుకు ఒక్కో కి.మీకు రూ.17 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ మూసీ సుందరీకరణకు ఒక్కో కి.మీకు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదెక్కడి వింత? ఈ స్కామ్ నిధులు మొత్తం కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులోకే వెళ్తున్నాయి’ అని ఆయన ట్వీట్ చేశారు.