News March 23, 2025

TG సిఫారసు లేఖలపై రేపటి నుంచి శ్రీవారి దర్శనం

image

TG ప్రజాప్రతినిధుల <<15790945>>సిఫారసు లేఖలపై<<>> తిరుమల శ్రీవారి దర్శనం రేపటి నుంచి అమలు కానుంది. సోమ, మంగళవారాల్లో VIP బ్రేక్, బుధ, గురువారాల్లో ₹300 స్పెషల్ దర్శనాలు ఉంటాయి. AP సిఫారసు లేఖలపై MONకి బదులు ఆదివారం దర్శనాలకు అనుమతిస్తారు. కాగా ఈనెల 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో VIP బ్రేక్ దర్శనాలను TTD రద్దు చేసింది. 24, 29 తేదీల్లో సిఫారసు లేఖలు తీసుకోబోమని తెలిపింది.

Similar News

News January 8, 2026

పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం

image

AP: పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. బ్రాహ్మణులు చనిపోతే ఆ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ స్కీమ్‌తో కష్ట సమయంలో వారికి ఉపశమనం కలుగుతుందని చెప్పారు. దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిపారు. అమరావతి సచివాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్‌తో సమావేశమై గరుడ పథకంపై చర్చించారు.

News January 8, 2026

స్పర్శిస్తూ కళను అనుభూతి చెందుతున్నారు!

image

కళను కళ్లతో చూడడమే కాదు చేతులతో తాకి అనుభూతి చెందవచ్చని నిరూపిస్తోంది జైపూర్‌లోని(RJ) ‘రాజస్థాన్ నేత్రహీన్ కళ్యాణ్ సంఘ్’. St+art ఫౌండేషన్‌ చేపట్టిన ‘స్పర్శ్’ ప్రాజెక్ట్ ద్వారా అంధ విద్యార్థుల కోసం గోడలపై ‘టాక్టైల్ ఆర్ట్’ను రూపొందించారు. బ్రెయిలీ లిపి, టెక్స్‌చర్డ్ పెయింట్స్‌తో తీర్చిదిద్దిన ఈ చిత్రాలను స్పర్శిస్తూ అంధ విద్యార్థులు రాజస్థాన్ సంస్కృతిని అనుభూతి చెందుతున్నారు.

News January 8, 2026

AP క్యాబినెట్ నిర్ణయాలు

image

* వైద్యుడు సుధాకర్ ఫ్యామిలీకి రూ.కోటి సహాయం. ఆయన కొడుకు సి.కె.లలిత్ ప్రసాద్‌కు స్పెషల్ ప్రమోషన్ కింద డిప్యూటీ తహశీల్దార్‌గా పదోన్నతి
* పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
* పాఠశాల కిట్ల పంపిణీకి రూ.944.53కోట్లకు పరిపాలన అనుమతులు
* ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం
* 39.52 లక్షల విద్యార్థులకు పెండింగ్‌లో పెట్టిన సొమ్ము చెల్లింపునకు ఆమోదం