News April 24, 2025
నేడు శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులైకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. గదుల కోటా బుకింగ్ మ.3 గంటలకు అందుబాటులో ఉంచనుంది. అలాగే మే నెలకు సంబంధించి పద్మావతి అమ్మవారి ఆలయం స్పెషల్ ఎంట్రీ దర్శన్ రూ.200 టికెట్లను కూడా రేపు ఉ. 10 గంటలకు రిలీజ్ చేయనుంది.
వెబ్‌సైట్: <
Similar News
News April 24, 2025
సిద్దిపేట: అప్పుల బాధతో కలప వ్యాపారి ఆత్మహత్య

అప్పుల బాధతో కలప వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. వివరాలు.. దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లికి చెందిన చిన్న నర్సింహా రెడ్డి(56) సిద్దిపేటలోని గ్రీన్ కాలనీలో టింబర్ డిపో నడిపిస్తున్నాడు. వ్యాపారం కోసం చేసిన అప్పులు తీరకపొవడంతో మనస్తాపానికి గురైన నర్సింహారెడ్డి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News April 24, 2025
పాక్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా నిలిపివేత

పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతాను భారత్ బ్యాన్ చేసింది. ఆ ట్విటర్ పేజీ ఓపెన్ చేస్తే ‘విత్‌హెల్డ్’ అని చూపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య రాకపోకల్ని, దౌత్య సంబంధాల్ని కట్ చేసింది. అటు సింధు జలాల ఒప్పందాన్నీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు నెట్టింట కూడా పాక్‌కు యాక్సెస్ లేకుండా అడ్డుకుంది.
News April 24, 2025
జమ్మూ ఎన్‌కౌంటర్ Live Update: భారత జవాన్ వీర మరణం

జమ్మూ కశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జవాన్ మృతి చెందారు. అక్కడ ముష్కరులు ఉన్నారని సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టగా ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ సోల్జర్ వీర మరణం పొందారని భద్రతా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అక్కడ భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.