News September 18, 2024
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా డిసెంబర్ కోటా ఆన్లైన్ టికెట్లను TTD రిలీజ్ చేసింది. ఈ నెల 20న ఉ.10 గంటల వరకు నమోదుకు అవకాశమిచ్చింది. 21న మ.3 గంటలకు వర్చువల్ టికెట్లు రిలీజ్ చేయనున్నారు. 23న ఉ.10 గంటలకు అంగ ప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు రిలీజ్ చేస్తారు. 24న ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మ.3 గంటలకు వసతి కోటా విడుదల చేయనున్నారు.
Similar News
News November 19, 2025
ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 13 మంది మృతి

దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా, నలుగురు గాయపడినట్లు లెబనాన్ ప్రకటించింది. ఐన్ ఎల్-హిల్వే ప్రాంతంలో ఆయుధాలతో ఉన్న హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే అక్కడ ఎలాంటి సాయుధ బలగాలు లేవని లెబనాన్ పేర్కొంది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది.
News November 19, 2025
HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News November 19, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,24,860కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 1,100 ఎగబాకి రూ.1,14,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


