News August 3, 2024
జులైలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.125 కోట్లు
AP: తిరుమల శ్రీవారిని జులైలో 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో శ్యామలరావు తెలిపారు. హుండీ ఆదాయం రూ.125 కోట్లు లభించిందన్నారు. అలాగే 1.04 కోట్ల లడ్డూలను విక్రయించామన్నారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఆగస్టు 15-17 మధ్య పవిత్రోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News February 3, 2025
నిధులు కేటాయించండి: పనగరియాకు చంద్రబాబు విజ్ఞప్తి
ఢిల్లీ పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అర్వింద్ పనగరియాను ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై ఆయనతో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం, నిధుల కేటాయింపులో పెద్ద మనస్సు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసిందని పనగరియా వద్ద నేతలు ప్రస్తావించారు.
News February 3, 2025
SECకి వైసీపీ ఫిర్యాదు
AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పదవుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తిరుపతి, హిందూపురం, నెల్లూరులో వైసీపీ కార్పొరేటర్లపై కూటమి నేతలు దాడి చేశారని, ఆ ఎన్నికలను వాయిదా వేయాలని విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్నికి వైసీపీ నేతలు వినతిపత్రం అందించారు.
News February 3, 2025
ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పిన ‘సంక్రాంతికి వస్తున్నాం’
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.303 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా భీమ్స్ మ్యూజిక్ అందించారు. కాగా, త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.