News December 24, 2024
ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం: టీటీడీ

AP: దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మిస్తామని TTD EO శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ‘ప్రపంచంలోని పలు దేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం. సీఎం ఆదేశాల మేరకు ఇందుకు ఓ కమిటీ వేస్తున్నాం. నడక దారిలో వచ్చే భక్తుల కోసం ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తాం. TTD సేవలపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
Similar News
News October 30, 2025
ఇంట్లో ఈ మొక్కలుంటే దోమలు పరార్

దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి మార్కెట్లో దొరికే కాయిల్స్, క్రీమ్స్, మస్కిటో మ్యాట్ ప్రొడక్ట్స్ వాడతాం. వీటి ప్రభావం మనపై కూడా పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవాలంటున్నారు నిపుణులు. బంతి, తులసి, లావెండర్, రోజ్మేరీ, కలబంద మొక్కలు దోమలను తరిమేయడంలో సహకరిస్తాయి. అలాగే ఇంటి బయట వేప, యూకలిప్టస్ చెట్లను పెంచినా దోమల బెడద తగ్గుతుందంటున్నారు నిపుణులు.
News October 30, 2025
బంతి తగిలి యంగ్ క్రికెటర్ మృతి

ఆస్ట్రేలియా క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. బంతి తగిలి యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్(17) ప్రాణాలు కోల్పోయాడు. మెల్బోర్న్లో ప్రాక్టీస్ చేస్తుండగా బెన్ మెడకు బంతి బలంగా తాకడంతో చనిపోయాడు. అతడి మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంచి భవిష్యత్ ఉన్న ఆటగాడిని కోల్పోయామని పేర్కొంది. కాగా పదకొండేళ్ల క్రితం ఆసీస్ బ్యాటర్ ఫిలిప్ హ్యూస్ కూడా బంతి తాకి ప్రాణాలు కోల్పోయారు.
News October 30, 2025
అయోధ్య రామునికి రూ.3వేల కోట్ల విరాళం

అయోధ్యలో రామ మందిరం కోసం 2022 నుంచి ఇప్పటి వరకు రూ.3వేల కోట్లకుపైగా విరాళాలు అందాయి. ఇందులో దాదాపు రూ.1,500 కోట్లను నిర్మాణం కోసం ఖర్చు చేసినట్లు రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. నవంబర్ 25న ఆలయంలో జరిగే జెండా ఆవిష్కరణ వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మరో 8 వేల మందిని ఆహ్వానించనున్నట్లు చెప్పారు.


