News April 24, 2024

రేపు ఉ.10 గంటలకు శ్రీవారి టికెట్లు విడుదల

image

తిరుమల శ్రీవారి జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 కోటా) టికెట్లను టీటీడీ రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. అలాగే జులై నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లను కూడా ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. అటు వృద్ధులు, వికలాంగుల కోటా టికెట్లు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి.

Similar News

News April 3, 2026

అమరావతిపై 2-3 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్

image

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లును ఆమోదించాయి. పార్లమెంటు సెక్రటేరియట్ నుంచి హోం శాఖకు ఈ బిల్లు ప్రతులు చేరాయి. బిల్లును హోంశాఖ 2, 3 రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనుంది. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే చట్టంగా మారుతుంది. ఆపై కేంద్రం దానిపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అనంతరం అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధ రాజధాని కానుంది.

News April 3, 2026

శరీరంలో వేడిని ఎలా తగ్గించాలంటే?

image

కొందరి శరీరంలో ఎప్పుడూ వేడి ఎక్కువగా ఉంటుంది. ఇది తగ్గాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కొబ్బరినీళ్లు, కలబంద, పుదీనా జ్యూస్ వంటివి వేడి తగ్గడంలో సహకరిస్తాయి. మజ్జిగ, విటమిన్ సీ ఉండే ఆహారాలు తీసుకోవాలి. అలాగే కీరదోస, బీట్‌రూట్ జ్యూస్ తాగినా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు తగినంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 3, 2026

₹931 కోట్ల అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్!

image

అమెరికాకు చెందిన మరో F-35 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. సెంట్రల్ ఇరాన్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా దాడి చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి పలు ఫొటోలను షేర్ చేసింది. దీనిపై ఇంకా US స్పందించలేదు. మార్చి 19న కూడా F-35 జెట్‌ను కూల్చేసినట్టు ఇరాన్ చెప్పింది. ఈ విమానం విలువ ₹931 కోట్ల పైనే అని సమాచారం. కువైట్‌లో చమురు శుద్ధి కర్మాగారం, సౌదీలోని US రాడార్‌ను ఇరాన్ ధ్వంసం చేసింది.