News January 3, 2025
శ్రీవారికి గత ఏడాది రూ.1365 కోట్ల ఆదాయం
తిరుమలేశుడికి గత ఏడాది హుండీ ద్వారా సమకూరిన ఆదాయం వివరాలను టీటీడీ తాజాగా వెల్లడించింది. స్వామివారికి 2024లో రూ.1365 కోట్లు వచ్చాయని పేర్కొంది. మొత్తంగా 2.55 కోట్లమంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారని, వారిలో 99లక్షలమంది తలనీలాలు సమర్పించారని తెలిపింది. 12.44 కోట్ల లడ్డూల్ని విక్రయించామని స్పష్టం చేసింది.
Similar News
News January 5, 2025
దివ్యాంగ విద్యార్థులకు నేరుగా అకౌంట్లలోనే పింఛన్: మంత్రి డోలా
AP: దివ్యాంగ విద్యార్థులకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. వారికి ప్రతినెలా పింఛన్‌ను నేరుగా అకౌంట్లలోనే జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలను అందిస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం వైజాగ్‌లో 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో స్టేడియం నిర్మిస్తామని పేర్కొన్నారు.
News January 5, 2025
ఇంటర్, డిగ్రీ అర్హత.. భారీ జీతంతో ఉద్యోగాలు
CBSEలో 212 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. https://www.cbse.gov.in/ వెబ్‌సైట్‌లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 142 సూపరింటెండెంట్(డిగ్రీ అర్హత), 70 జూనియర్ అసిస్టెంట్(ఇంటర్ అర్హత) ఉద్యోగాలున్నాయి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ సూపరింటెండెంట్‌కు ₹35,400-₹1,12,400, JAకు ₹19,900-₹63,200 ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
News January 5, 2025
5-15 ఏళ్ల విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు: మంత్రి సత్యకుమార్
AP: 45 ఏళ్లు నిండిన గ్రామీణ ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 5-15 ఏళ్ల విద్యార్థులకు టెస్టులు నిర్వహించి ఫ్రీగా 90వేల కళ్లద్దాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.