News February 10, 2025
‘సింగిల్’గా వస్తున్న శ్రీవిష్ణు

విభిన్న కథాంశాలతో హీరో శ్రీవిష్ణు తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సింగిల్’. గీతా ఆర్ట్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఇవాళ సా.4.05 గంటలకు రిలీజ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ను చిత్రయూనిట్ పంచుకుంది. ఓ చేతిలో రేడియోతో గొంగిడి కప్పుకొని నడుచుకుంటూ వస్తున్న విష్ణు లుక్ ఆకట్టుకుంటోంది.
Similar News
News December 3, 2025
ఉమ్మడి విశాఖలో ‘బెల్ట్’తో నష్టాలు భర్తీ..?

ఉమ్మడి విశాఖ జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం లైసెన్స్ ఫీజు పెంచడంతో ఆ నష్టం నుంచి బయటపడేందుకు కొందరు వ్యాపారులు బెల్ట్ షాపులతో సిండికేట్ అయ్యి ఆదాయాన్ని పెంచుకుంటున్నారని ఆరోపణలొస్తున్నాయి. అధికారికంగా విశాఖలో 159మద్యం షాపులు, 64 బార్లు, అనకాపల్లి 156షాపులు, 5 బార్లు, అల్లూరి జిల్లాలో 39 వైన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ.280 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం.
News December 3, 2025
రైతుల ఖాతాల్లో రూ.7,887కోట్లు జమ: ఉత్తమ్

వరి సేకరణలో TG అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. 48hrsలో ₹7,887Cr చెల్లించాం. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. సన్న రకాలకు ₹314Cr బోనస్ చెల్లించాం. అటు APలో ఇప్పటివరకు 11.2L టన్నులు సేకరించారు. 1.7లక్షల మందికి రూ.2,830Cr చెల్లించారు. AP కంటే TG స్కేల్ 4 రెట్లు ఎక్కువ’ అని ట్వీట్ చేశారు.
News December 3, 2025
ALERT.. అతి భారీ వర్షాలు

AP: రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని IMD అంచనా వేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.


