News October 14, 2025

SRP: డిప్యూటేషన్ పై పనిచేసేందుకు దరఖాస్తులు

image

టీజీ జెన్కోలోని తాడిచెర్ల- 1 బొగ్గుగనిలో ఒక ఏడాది పాటు డిప్యూటేషన్ పై పనిచేసేందుకు ఎగ్జిక్యూటివ్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాల జీఎంలకు సర్క్యులర్ జారీ చేసింది. మైనింగ్, పర్సనల్, సర్వే విభాగాలు, ఓవర్ మెన్ హోదా నుంచి ఈ/4, ఈ/5 గ్రేడ్‌లలో ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 17 లోపు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది.

Similar News

News October 14, 2025

16న శ్రీశైలం వచ్చే భక్తులకు ముఖ్య గమనిక

image

ఈనెల 16న శ్రీశైలం వచ్చే భక్తులు, యాత్రికులకు అధికారులు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వైపు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, దోర్నాల మీదుగా శ్రీశైలం వచ్చే వారు తమ ప్రణాళికను సవరించుకోవాలన్నారు.

News October 14, 2025

పథకాలు సాధించిన దీప్తికి సీఎం అభినందనలు

image

పర్వతగిరి మండలానికి చెందిన దీప్తి జీవాంజీ ఆస్ట్రేలియాలో జరిగిన వర్టూస్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2025లో 2 స్వర్ణ పతకాలు సాధించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆమెను మంగళవారం అభినందించారు. సాధారణ, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న దీప్తి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

News October 14, 2025

జిల్లా వ్యాప్తంగా బెల్టు షాపులను మూసివేయండి: కలెక్టర్

image

సారా, అనధికార మద్యం రహిత జిల్లాగా విజయనగరం ఉండాలని జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. ఎస్పీ దామోదర్ తో కలిసి ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు గట్టి నిఘా ఉంచాలన్నారు. ప్రభుత్వమే అక్రమ మద్యం, బెల్ట్ షాప్ లు ఉండకూడదని చెప్పిన తర్వాత ఇక ఆలోచించేది లేదని, ఎవ్వరిపై నైనా కేసులు పెట్టే తక్షణమే బెల్ట్ షాప్ లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.