News March 5, 2025
SRPT: ఇద్దరు RIలను సస్పెండ్ చేసిన కలెక్టర్

మోతే తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులను ట్యాంపరింగ్ చేసిన ఇద్దరు ఆర్‌ఐలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. మోతే మండల ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న జే.నిర్మలదేవి, అదనపు ఆర్‌ఐ షేక్ మన్సుర్ అలీలు పాత పహాణిలను సస్పెండ్ చేశారు. రికార్డులలో పేర్లు లేకపోయినా పేర్లు ఉన్నట్లు సృష్టించి ధరణిలో మిస్సింగ్ సర్వే నంబర్లు కింద 11 దరఖాస్తులు చేపించి భూమి ఉన్నట్టు తప్పుడు ధ్రువీకరణ సృష్టించారని అన్నారు.
Similar News
News December 8, 2025
మావోయిస్టు కీలక నేత లొంగుబాటు.. MMCలో ఉద్యమం అంతం!

మావోయిస్టు పార్టీ కీలక నేత రామ్‌ధేర్ మజ్జీ సహా 12 మంది ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రామ్‌ధేర్ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతడిపై రూ.3 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. రామ్‌ధేర్ లొంగుబాటుతో MMC జోన్‌లో మావోయిజం అంతమైనట్లేనని భావిస్తున్నారు.
News December 8, 2025
HYD: ప్రభుత్వ ఆఫీసర్లకు గ్లోబల్ సమ్మిట్ డ్యూటీ

గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు డ్యూటీ విధించారు. మీర్‌ఖాన్‌పేట్‌లో నేడు, రేపు సమ్మిట్ వైభవంగా జరగనుంది. భారీ సంఖ్యలో పోలీసులను సమ్మిట్ ప్రాంతానికి తరలిస్తూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులను ఏర్పాట్ల పనుల కోసం నియమించడంతో వారు మొత్తం కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమయ్యారు.
News December 8, 2025
NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్‌లో 5 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల వారు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి BE, B.tech, PG(అగ్రి బిజినెస్), M.COM, CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: nccd.gov.in.


