News April 17, 2025
SRPT: ఉద్యోగాలు.. APPLY NOW

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25 వరకు గడువు పొడిగించినట్లు సూర్యాపేట జిల్లా ఉపాధికల్పన అధికారి శంకర్ తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 20, 2025
ఆయన వల్లే IPL సాధ్యమైంది: లలిత్ మోదీ

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వల్లే ఐపీఎల్ ఆలోచన కార్యరూపం దాల్చిందని లీగ్ ఫౌండర్ లలిత్ మోదీ చెప్పారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని ఇన్‌స్టాలో ఆర్టికల్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు IPL లేకుండా క్రికెట్ ప్రపంచాన్నే ఊహించలేమన్నారు. పవార్ విజనరీని మరిచిపోవద్దన్నారు. శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.
News April 20, 2025
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్‌ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.
News April 20, 2025
బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. మహిళకు జైలు శిక్ష

రాజస్థాన్‌లో ఓ బాలుడిని(17) అపహరించి లైంగిక దాడికి పాల్పడిన మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబరు 7న ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితురాలు తమ కుమారుడికి మద్యం పట్టించి లైంగిక దాడికి పాల్పడిందని వారికి తెలిపారు. దర్యాప్తులో ఫిర్యాదు నిజమని నిర్ధారణ కావడంతో పోక్సో కోర్టు నిందితురాలికి జైలు శిక్షతో పాటు రూ.45వేల జరిమానా విధించింది.