News February 15, 2025
SRPT: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News November 17, 2025
BHPL: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

పత్తి జిన్నింగ్ మిల్లుల విషయంలో సీసీఐ నిబంధనలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. కావున, జిల్లాలోని రైతులందరూ ఈ విషయంను గమనించి, ఈనెల 17 నుంచి పత్తి జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకురావద్దని తెలిపారు.
News November 17, 2025
జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, నిమ్మరసం చేర్చి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టిని పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేస్తే జిడ్డు తగ్గుతుంది.
News November 17, 2025
HYD: ప్రైవేట్ ట్రావెల్స్‌పై అధికారుల కొరడా

రంగారెడ్డి జిల్లాలో రవాణాశాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా ఝుళిపిస్తున్నారు. ఓవర్‌లోడ్ వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 72 వాహనాలు సీజ్ చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని, నిబంధనల ఉల్లంఘనచేస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఉప రవాణాశాఖాధికారి సదానందం ఆదేశాలపై చర్యలు కొనసాగిస్తున్నారు.


