News February 13, 2025

SRPT: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు

image

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Similar News

News December 9, 2025

గన్నవరం-ఢిల్లీ ఇండిగో సర్వీస్ ఈ నెల 11 వరకు రద్దు

image

విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో రెగ్యులర్ సర్వీసులను ఆపరేషనల్ కారణాల వల్ల డిసెంబర్ 11 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించింది. విమానం రద్దు కావడంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీషెడ్యూల్ లేదా రిఫండ్‌ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని ఇండిగో సూచించింది.

News December 9, 2025

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్‌లో ఉద్యోగాలు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్‌లో 14 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ(ఫిజిక్స్, మ్యాథ్స్, జియోఫిజిక్స్,జియాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 15లోపు దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://iigm.res.in/

News December 9, 2025

ఫ్యూచర్ సిటీలో ‘రేసింగ్ & మోటోక్రాస్’ కేంద్రం

image

TG: భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ-ప్రామాణిక ‘రేసింగ్ & మోటోక్రాస్’ కొలువుదీరనుంది. ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ‘సూపర్‌క్రాస్ ఇండియా’ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీనిలో డర్ట్ ట్రాక్‌లు, రైడర్ శిక్షణ, ఇతర మౌలిక సదుపాయాలను కంపెనీ ఏర్పాటుచేయనుంది. ఇందులో ప్రపంచ రేసింగ్, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లను నిర్వహిస్తారు. భూమి, ఇతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది.