News August 6, 2024

SRPT: ఒకేసారి అన్నా చెల్లికి ప్రభుత్వ ఉద్యోగాలు

image

అన్నా చెల్లెలు ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులతో పాటు బంధువులను ఆనందోత్సవాలతో ముంచారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సమ్మెట విజయ్‌ కుమార్‌, రేణుక ఎల్లమ్మల కుమారుడు రాహుల్‌ గౌడ్‌, కుమార్తె ఐశ్వర్య ఉన్నారు. వీరు ఇటీవల వెలువడిన ఫలితాలలో రాహుల్ పంచాయతీ రాజ్‌లో ఏఈఈ, ఐశ్వర్య పబ్లిక్ హెల్త్‌లో ఏఈఈ ఉద్యోగం పొందారు.

Similar News

News February 12, 2025

NLG: మహిళా టీచర్ల సమస్యల పరిష్కారానికే పోటీ: అర్వ స్వాతి

image

మహిళా టీచర్ల సమస్యలను కౌన్సిల్లో తీర్చేందుకే స్వతంత్ర మహిళ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అర్వ స్వాతి తెలిపారు. తన నామినేషన్ స్క్రూటినీలో ఓకే అయిన సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో 4 సార్లు జరిగిన ఎన్నికలలో మహిళలు పోటీలో లేరని, మెజారిటీ మహిళలు సంఘ బాధ్యులుగా లేని కారణంగా ఏ సంఘం మహిళా అభ్యర్థులను పోటీకి నిలపలేదని, పురుష అభ్యర్థులను గెలిపిస్తే మహిళల సమస్యలు పరిష్కరించలేదన్నారు.

News February 12, 2025

చెరువుగట్టు హుండీ ఆదాయం రూ. 16,45,100

image

చెర్వుగట్టు శ్రీపార్వతీ జడలరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. పది రోజులకు గాను అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.3,19,600లు, స్వామివారి హుండీ ఆదాయం రూ. 13,25,500లు లభించినట్లు ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ నల్గొండ డివిజన్ పరిశీలకురాలు బి. సుమతి, దేవస్థాన పర్యవేక్షకులు జి. తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

News February 11, 2025

NLG: రూ.113.33 కోట్ల రైతు భరోసా జమ

image

జిల్లాలో రెండెకరాలలోపు భూమి ఉన్న 1,85,545 మంది రైతుల ఖాతాల్లో రూ.113,33,74,857 రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. ఇంతకు ముందు జనవరి 26న 31 మండలాల్లో ఎంపిక చేసిన 31 గ్రామాల రైతులకు 35,568 మంది రైతుల ఖాతాల్లో 46,93,19,160 జమ చేసింది. మిగతా రైతులకు దశలవారీగా డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

error: Content is protected !!