News January 26, 2025
SRPT: కలెక్టరేట్లో జెండా ఎగరవేసిన పాలనాధికారి

సూర్యాపేట కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ వివిధ శాఖల అధికారులతో కలిసి జాతీయ జెండా ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొంది గణతంత్ర రాజ్యంగా అవతరించిందన్నారు. స్వాతంత్య్రోద్యమంలో యోధుల త్యాగాలను, వారి ఆశయాలను గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ రాంబాబు ఉన్నారు.
Similar News
News February 16, 2025
రంజీ ట్రోఫీ నుంచి జైస్వాల్ ఔట్?

టీమ్ ఇండియా ప్లేయర్ యశస్వీ జైస్వాల్ రంజీ సెమీస్ మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది. కాలి మడమ నొప్పి కారణంగా ఆయన ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 17 నుంచి విదర్భతో జరగనున్న సెమీ ఫైనల్ కోసం ముంబై సెలక్టర్లు జైస్వాల్‌ను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆయన గాయపడడం ముంబైకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టులోనూ జైస్వాల్ చోటు దక్కించుకోలేదు.
News February 16, 2025
నంద్యాల జిల్లాలో నవజాత శిశువు లభ్యం

సిరివెళ్ల మండలం జునెపల్లె ఎస్సీ కాలనీలో నవజాత శిశువు లభ్యం అయ్యింది. ఆదివారం తెల్లవారుజామున గ్రామంలోని ఓ వ్యక్తి కూలీలను పనికి పిలుస్తుండగా ఖాళీ స్థలం నుంచి శిశువు ఏడుపును గమనించాడు. అక్కడికి వెళ్లి చూడగా ఆడ శిశువుగా గుర్తించాడు. 108 వాహనానికి ఫోన్ చేయగా వారు వైద్యం నిమిత్తం శిశువును తీసుకెళ్లారు. అధికారులు విచారణ చేపట్టారు.
News February 16, 2025
కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.