News April 6, 2025

SRPT: కారు ఢీకొనడంతో.. యువతి మృతి

image

సూర్యాపేట జిల్లా రాయినిగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పిల్లలమర్రి గ్రామానికి చెందిన దాసరి విజిత(23) మృతి చెందారు. మృత్యురాలు 7R హోటల్‌లో పని చేయడానికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వేగంగా వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.

Similar News

News April 21, 2025

1న నెల్లూరు జిల్లాకు సీఎం రాక

image

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన మే 1న ఆత్మకూరుకు రానున్నారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆంజనేయస్వామి ఆలయం పక్కనే ఉన్న హెలిప్యాడ్‌ను ఆర్డీవో పావని, పోలీసులు పరిశీలించారు. సీఎం పర్యటన పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.

News April 21, 2025

నక్సలిజం అంతమయ్యే వరకూ దాడులు ఆపం: అమిత్ షా

image

నక్సలిజాన్ని తుదముట్టించేంత వరకూ భద్రతా బలగాల దాడులు కొనసాగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రూ.కోటి రివార్డున్న వివేక్ అనే మావోయిస్టుతో పాటు మరో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారని తెలిపారు. నక్సల్స్ ఏరివేతలో భద్రతా బలగాలు విజయం సాధించాయన్నారు. కాగా 2026 మార్చి 31 కల్లా నక్సల్ రహిత దేశంగా భారత్‌ నిలుస్తుందని అమిత్‌షా ప్రకటించిన సంగతి తెలిసిందే.

News April 21, 2025

కరీంనగర్: ధరణిలో పొరపాట్ల సవరణ అధికారం కలెక్టర్‌కే : పమేలా సత్పతి

image

ధరణిలో పొరపాట్లను సవరించడానికి కలెక్టర్ మినహా ఏ అధికారికి అవకాశం లేదని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం గంగాధరలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో భూభారతి, ఆర్వోఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న సమస్యలు వేలసంఖ్యలో పేరుకుపోయాయన్నారు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరిస్తుందన్నారు.

error: Content is protected !!