News March 20, 2024

SRPT: కుక్కల దాడిలో 32 గొర్రెలు మృతి

image

తిరుమలగిరి మండలం వెలిశాలలో గొర్ల మందపై కుక్కలు దాడి చేసిన ఘటన ఈ తెల్లవారు జామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లంల సమ్మయ్య దొడ్డిలో ఉన్న 32 గొర్లపై కుక్కలు దాడి చేసి చంపినట్లు సమ్మయ్య వాపోయారు. వాటి విలువ సుమారు రూ.2,50,000 విలువ ఉంటుందని, రైతు అవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరుతున్నాడు.

Similar News

News September 17, 2024

ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండ పట్టణంలోని పోలీస్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ పవర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలునాయక్ తదితరులున్నారు.

News September 17, 2024

నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద స్వల్పంగా పెరింది. 2 గేట్లు 8 అడుగుల మేరకు ఎత్తి 24,884 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్‌కు ఇన్ ఫ్లో 68,327 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 22,366 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 589.90 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 311.7462 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

News September 17, 2024

నల్గొండ: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు బ్రేక్‌

image

పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం విరివిగా నిర్వహించే డబుల్‌ పంక్చర్‌ ల్యాప్రోస్కోపిక్‌ (DPL) కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు జిల్లాలో బ్రేక్‌ పడింది. రెండో బిడ్డ పుట్టి కుటుంబ నియంత్రణ కోసం జిల్లాలో సుమారు 70 వేల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కు.ని కోసం పెద్ద సంఖ్యలో మహిళలు ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడ కు.ని ఆపరేషన్లు జరగడం లేదు.