News January 14, 2025

SRPT: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్త హత్య

image

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఆదివారం రాత్రి సైదులు అనే వ్యక్తిని అతని ఇద్దరి భార్యలు <<15142827>>మర్డర్ చేసిన<<>> సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. చివ్వెంల మండలానికి చెందిన సైదులు కారు డ్రైవర్. కొన్ని రోజులుగా పెద్ద భార్య కూతురిని అతను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో ఇద్దరు భార్యలు రోకలిబండతో సైదులును హతమార్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. 

Similar News

News February 15, 2025

NLG: మరోసారి కులగణన..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి కులగణన నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్వహించిన కులగణనలో 3 లక్షల పైచిలుకు మంది పాల్గొన లేదని తెలిసింది. అయితే వారందరి కోసం మళ్లీ కులగణన నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు కులగణన నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆన్‌లైన్ సర్వేతో పాటు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎంపీడీవో ఆఫీస్‌లో ప్రజాపాలన అధికారుల వద్ద కూడా నమోదు చేసుకోవచ్చు.

News February 15, 2025

నల్గొండ: పురుగుమందు తాగి వివాహిత సూసైడ్ 

image

మునుగోడు మండలం ఉకొండిలో కుటుంబ కలహాలతో వివాహిత పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నిమ్మల మానస(28), భర్త నగేష్ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. నగేష్ శుక్రవారం మునుగోడుకు వెళ్లి తిరిగి వచ్చే సరికి మానస పురుగు మందు సేవించి వాంతులు చేసుకుంది. చికిత్స కోసం నల్గొండ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు.

News February 15, 2025

NLG: ఎక్కడ చూసినా అదే చర్చ..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

error: Content is protected !!