News April 15, 2025

SRPT: కొడుకుతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య

image

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. చిలుకూరు మండలం కొత్తకొండాపురంలో బావిలో దూకి తల్లి వీరమ్మ, కుమారుడు నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే వీరమ్మ అన్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందగా.. తమ బాగోగులు చూసేవారు లేరని మనస్తాపం చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Similar News

News November 22, 2025

YVUలో అతిథి ఫ్యాకల్టీ పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు

image

YVU కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ. శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు PHD/MTech (ఏదైనా కంప్యూటర్ స్ట్రీమ్)/ఎంసీఎ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం YVU అధికార వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.

News November 22, 2025

TU: మాల్ ప్రాక్టీస్ చేస్తూ నలుగురు డిబార్

image

టీయూ పరిధిలోని ఉమ్మడి NZB జిల్లాలో 30 పరీక్షా కేంద్రాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ తెలిపారు. ఆయనతో పాటు పలువురు అధికారులు మోర్తాడ్, ఆర్మూర్ లలోని పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలకు 11,767 మంది విద్యార్థులకు గాను 11,087 మంది విద్యార్థులు హాజరు కాగా 676 మంది గైర్హాజరయ్యారు.నలుగురు డిబార్ అయినట్లు తెలిపారు.

News November 22, 2025

కమిటీల నిర్మాణం, కూర్పుపై జనసేన ఫోకస్: హరిప్రసాద్

image

AP: పార్టీ బలోపేతంపై JSP చీఫ్ పవన్ ఫోకస్ పెట్టినట్లు పార్టీ ముఖ్యనేత హరిప్రసాద్ తెలిపారు. ‘కమిటీల నిర్మాణంపై కసరత్తు, నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై పవన్ దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ కమిటీల వరకు నిర్మాణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పార్టీ శ్రేణుల మనోగతం, సూచనలను కార్యాలయ కమిటీ నమోదు చేస్తోంది’ అని పేర్కొన్నారు.