News April 15, 2025

SRPT: కొడుకుతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య

image

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. చిలుకూరు మండలం కొత్తకొండాపురంలో బావిలో దూకి తల్లి వీరమ్మ, కుమారుడు నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే వీరమ్మ అన్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందగా.. తమ బాగోగులు చూసేవారు లేరని మనస్తాపం చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Similar News

News December 4, 2025

HYD: గూగుల్‌మ్యాప్స్ ఫాలో అవుతున్నారా? జాగ్రత్త!

image

గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తున్నారా? మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రుళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. బోడుప్పల్‌లో ఓ వ్యక్తి తన వాహనంలో గుడ్డిగా దీన్ని నమ్మి బోడుప్పల్- పోచారం రూట్లో వెళ్లాడు. కుడివైపు మొత్తం మట్టి రోడ్డు ఉన్నప్పటికీ నావిగేషన్ అటువైపే చూపించింది. కొద్ది దూరం వెళ్లాక రోడ్డు లేకపోగా, భారీ గుంతలో పడ్డట్టు తెలిపారు. మీకూ ఇలా రాంగ్ డైరెక్షన్ చూపించిందా?

News December 4, 2025

గజ్వేల్: హోరెత్తనున్న ఎన్నికల ప్రచారం

image

గజ్వేల్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల ప్రచారం నేటి నుంచి హోరెత్తనుంది. గజ్వేల్, దౌల్తాబాద్, రాయపోల్, ములుగు, వర్గల్, మర్కూక్, జగదేవపూర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు పూర్తి కావడంతో డమ్మి సింబల్స్‌తో ప్రచారాన్ని నిర్వహించేందుకు వార్డు, సర్పంచ్ అభ్యర్థులు సిద్ధమయ్యారు. సమయం తక్కువగా ఉండడంతో SM ద్వారా ప్రచారం చేయనున్నారు.

News December 4, 2025

భద్రాద్రి: 3వ విడత తొలిరోజు అందిన నామినేషన్లు

image

3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం 7 మండలాల నుంచి నామినేషన్లు స్వీకరించారు. మండలాల వారీగా బుధవారం అందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్లు ఇలా. ఆళ్లపల్లి – 1, 2, గుండాల – 3, 3, జూలూరుపాడు – 5, 4, లక్ష్మీదేవిపల్లి – 4, 7, సుజాతనగర్ – 3, 1, టేకులపల్లి – 19, 7, ఇల్లందు – 6, 6.. 155 గ్రామపంచాయతీలకు గాను 41 సర్పంచ్, 30 వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు