News April 15, 2025
SRPT: కొడుకుతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. చిలుకూరు మండలం కొత్తకొండాపురంలో బావిలో దూకి తల్లి వీరమ్మ, కుమారుడు నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే వీరమ్మ అన్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందగా.. తమ బాగోగులు చూసేవారు లేరని మనస్తాపం చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News April 22, 2025
నిజామాబాద్: 59.25 శాతం ఉత్తీర్ణత: DIEO

ఇంటర్మీడియట్ 2024-25 విద్యా సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాలో 59.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మంగళవారం తెలిపారు. వార్షిక పరీక్షల్లో జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 59.25 శాతం ఉత్తీర్ణత సాధించారని, మొదటి సంవత్సరంలో 53.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వివరించారు.
News April 22, 2025
తుని: 28న మున్సిపల్ ఛైర్‌పర్సన్ , వైస్ చైర్మన్ ఎన్నిక

తుని మున్సిపాల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ స్థానాలకు ఈనెల 28న ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కోన్నారు. ప్రక్రియలో భాగంగా, 24న కలెక్టర్ ఎన్నికల అధికారి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. దీనితో మరోసారి ఉత్కంఠ నెలకొంది.
News April 22, 2025
వరంగల్: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.