News January 31, 2025
SRPT: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాలిలా.. తిరుమలగిరి మండలం వెలిశాలకి చెందిన పొన్నం గణేశ్ డీసీఎం డ్రైవర్. గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద కోళ్ల లోడుతో వస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గణేశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 11, 2025
PM ఫ్రాన్స్ పర్యటనలో చేసుకునే రక్షణ ఒప్పందాలివే

ఫ్రాన్స్‌నుంచి 26 రఫేల్-ఎం యుద్ధవిమానాలు, 3 స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్లను నేవీ కోసం కొనుగోలు చేయాలని భారత్ సూచనప్రాయంగా నిర్ణయించింది. ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఈ ఒప్పందం పూర్తికానుంది. ఫైటర్ జెట్స్ ఒప్పందం విలువ రూ.63వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా. INS విక్రాంత్, INS విక్రమాదిత్య నౌకలపై వీటిని మోహరించనున్నారు. ఇక 3 సబ్‌మెరైన్ల కొనుగోలు విలువ రూ.33,500 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.
News February 11, 2025
ప్రభాస్ ముగ్గురు చెల్లెళ్లను చూశారా?

దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, ముగ్గురు కూతుళ్లు(ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి) బంధువుల పెళ్లిలో దిగిన ఫొటో వైరలవుతోంది. సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ వేడుకకు హాజరుకాలేదు. ఈ క్రమంలో చెల్లెళ్లంతా కలిసి డార్లింగ్‌కు త్వరగా వివాహం జరిపించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కొడుకే ప్రభాస్. ఇతనికి అన్న ప్రబోధ్(నిర్మాత), సోదరి ప్రగతి ఉన్నారు.
News February 11, 2025
అయిజ: గుండెపోటుతో RMP వైద్యుడు మృతి

అయిజ మండలంలో గుండెపోటుతో RMP వైద్యుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాపురం స్టేజీలో కొన్నేళ్లుగా వెంకట్రాముడు అనే వ్యక్తి RMP వైద్యుడిగా పని చేస్తున్నాడు. కాగా నేడు సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. వైద్యుడి మృతితో పలు గ్రామాల ప్రజలు విచారణ వ్యక్తం చేశారు.