News July 10, 2024
SRPT: చికిత్స పొందుతూ బాలిక మృతి

పురుగు మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు మేరకు.. సూర్యాపేటకు చెందిన బాలిక(15) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈనెల 6న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News July 11, 2025
NLG: న్యాయవాద వృత్తిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో లా కోర్సు చేసిన బీసీ విద్యార్థుల నుంచి న్యాయవాది వృత్తిలో మూడేళ్ల పాటు ఉచిత శిక్షణ పొందేందుకు 2025-26కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన కళాశాల నుంచి లా కోర్స్ పాసై ఉండాలన్నారు. జిల్లాలో నలుగురు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News July 11, 2025
NLG: ఈ ఎన్నికల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

బీసీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1740 గ్రామపంచాయతీలు ఉన్నాయి. దీంతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు దక్కనున్నాయి.
News July 10, 2025
జూలై 18న మూసీ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల

మూసీ ప్రాజెక్ట్ నుంచి వానాకాలం సాగు సీజన్‌కు సంబంధించిన నీటి విడుదలను జూలై 18న ప్రారంభించనున్నట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 641.63 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు, సూర్యాపేటకు తాగునీరు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.