News March 4, 2025
SRPT: టీచర్ MLC ఎన్నికలు.. ‘ఏక్’ నిరంజన్!

NLG – KMM – WGL టీచర్ MLC ఎన్నికల ఫలితాల్లో ఓ అభ్యర్థి ఒకటే ఓటు వచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో బంకా రాజు-7, కంటె సాయన్న-5, చలిక చంద్రశేకర్-1 సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితమయ్యారు. కాగా.. మరో ఆరుగురు తాటికొండ వెంకటయ్య-39, జంగిటి కైలాసం-26, పన్నాల గోపాల్రెడ్డి-24, అర్వ స్వాతి-20, లింగిడివెంకటేశ్వర్లు-15, పురుషోత్తంరెడ్డి-11 డబుల్ డిజిట్ ఓట్లతో సరిపెట్టుకున్నారు.
Similar News
News October 31, 2025
విశాఖ: ఆర్టీసీలో డ్రైవర్ పోస్ట్ల భర్తీ

ఆర్టీసీలో పదోన్నతుల కారణంగా డ్రైవర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయని రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ఐటీఐ చేసి 18 నెలల హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారిని ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో అన్కాల్ డ్రైవర్గా తీసుకోవడం జరుగుతుందని, దగ్గర్లో ఉన్న డిపోల్లో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
News October 31, 2025
జగిత్యాల: వరుస చోరీలకు బ్రేక్

మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణాలను వణికించిన వరుస దొంగతనాలకు తెరపడింది. ఏకంగా 11 ఇళ్ళు, గుడిలో చోరీలకు పాల్పడ్డ ముఠాను మెట్పల్లి సీఐ అనిల్ కుమార్ నేతృత్వంలోని బృందం తక్కువ రోజుల్లోనే ఛేదించి అరెస్ట్ చేసింది. క్లిష్టమైన కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీస్ బృందం పనితీరును జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. వారికి అవార్డులు కూడా అందించారు.
News October 31, 2025
పంట, రైతుల వివరాలను నమోదు చేయాలి: వ్యవసాయ అధికారి

సాగు చేస్తున్న పంట, రైతుల వివరాలను యాప్లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల అన్నారు. బయ్యారం మండలం కొత్తపేటలో వరి సాగు పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాప్లో నమోదు చేసుకోవడం వల్ల పంట క్రయ విక్రయాలు సులభం అవుతాయని పేర్కొన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన పంటలను ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేస్తామన్నారు. ఏవో రాజు, ఏఈవోలు నాగరాజు, అఖిల్ పాల్గొన్నారు.


