News April 4, 2025
SRPT: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

సూర్యాపేట జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.
Similar News
News November 25, 2025
FLASH: బోరబండలో నిప్పు అంటించుకున్న హిజ్రాల్లో ముగ్గురి మృతి

ట్రాన్స్జెండర్ మోనాలిసాకు వ్యతిరేకంగా ఇటీవల బోరబండ బస్టాండ్లో ఓ వర్గం చేపట్టిన ఆందోళన తీవ్ర విషాదంగా మారింది. ఆందోళన సమయంలో పెట్రోల్ పోసుకున్న ట్రాన్స్జెండర్లలో చికిత్స పొందుతూ మంగళవారం నవనీత (24) బాలానగర్లోని ఓ ఆస్పత్రిలో మరణించింది. ఈ నెల 20న అప్సానా, 23న హీనా కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. బోరబండ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.
News November 25, 2025
బలవంతపు వాంతులతో క్యాన్సర్: వైద్యులు

బ్రష్ చేశాక చాలా మంది గొంతులోకి వేళ్లు పెట్టి బలవంతంగా వాంతులు చేసుకుంటారు. అలా పదే పదే చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కడుపులోని యాసిడ్ పదేపదే పైకి తన్నడం వల్ల అన్నవాహికలోని ‘టైల్స్’ లాంటి సున్నితమైన కణాలు అరిగిపోతాయి. ఇలా మాటిమాటికీ జరిగితే తీవ్రమైన సందర్భాల్లో క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుకను గీసుకొని ముఖం కడుక్కుంటే చాలు’ అని సూచించారు.
News November 25, 2025
5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.


