News March 17, 2025
SRPT: తొలగనున్న ఇంటర్ విద్యార్థుల కష్టాలు

JLలుగా ఎంపికైన వారికి ప్రభుత్వం ఇటీవల నియామక పత్రాలు ఇచ్చిన సంగతి తెలిసింది. కాగా సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కొత్త లెక్చరర్స్ విధుల్లో చేరారు. ప్రభుత్వం జిల్లాకు 14మంది లెక్చరర్స్‌ను కేటాయించింది. వారిలో 11 మంది ఇప్పటికే ఛార్జ్ తీసుకున్నారు. ఇప్పటివరకు గెస్ట్ లెక్చరర్లను పెట్టి కాలం వెళ్లదీస్తుండగా రెగ్యులర్ సిబ్బంది రాకతో ఇక నుంచి ఇంటర్ విద్యార్థుల కష్టాలు తొలగిపోనున్నాయి.
Similar News
News November 28, 2025
వేములవాడ పోలీసుల అదుపులో నిందితుడు సంతోశ్..!

మాజీ నక్సలైట్ బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధయ్య హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న జక్కుల సంతోశ్ వేములవాడ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తాను అజ్ఞాతంలో ఉండగా ఎందరినో చంపినట్లుగా నర్సయ్య ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా చెప్పడంతో తన తండ్రిని నర్సయ్య చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన సంతోశ్ యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ కావాలంటూ నర్సయ్యను పిలిపించి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
News November 28, 2025
బాపట్ల: పరీక్షల షెడ్యూల్ రద్దు..!

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి నిర్వహించాల్సిన పీజీ పరీక్షల షెడ్యూల్‌ను రద్దు చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచన మేరకు పీజీ పరీక్షలు జరిగే తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
News November 28, 2025
జనగామ: నీకు నేను.. నాకు నువ్వు..!

కోతులు ఇబ్బంది పెడుతున్నాయంటూ జనగామ జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మనం ఇబ్బంది పడినట్లుగానే కోతులు కూడా అవస్థలు పడుతున్నాయి. రోజంతా ఆహార సేకరణ కోసం తిరిగి అలిసిపోయిన వానరాలు.. జనగామలోని రైల్వే స్టేషన్‌కి చేరాయి. గోడ పైన సేద తీరుతూ, చలికి వణుకుతూ ‘నీకు నువ్వు.. నాకు నేను’ అన్నట్లుగా ఒక దానికి ఒకటి హత్తుకొని కూర్చున్నాయిలా..


