News April 10, 2025
SRPT: త్వరలో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు

NLG రీజియన్కు ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. తొలిసారి కాలుష్య రహిత సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్లు రోడ్లపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ మార్పులు చేస్తూ ప్రయాణికులను పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఇంధనం ఖర్చు తగ్గించుకుని ఈ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. సూర్యాపేట డిపోకు 75 బస్సులు కేటాయించారు.
Similar News
News November 21, 2025
Rh నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఏం చేయాలంటే?

తల్లి బ్లడ్ గ్రూప్ నెగటివ్ అయితే ప్రెగ్నెన్సీలో కచ్చితంగా ఇండైరెక్ట్ కూంబ్ టెస్ట్ (ICT) 3,7 నెలల్లో చేయించుకోవాలి. ఐసీటీ నెగెటివ్ వస్తే ఏడో నెలలో, డెలివరీ అయిన 72 గంటల్లో తల్లికి ‘యాంటీ డీ’ ఇంజెక్షన్ డోసులు ఇస్తారు. రెండోసారి గర్భం దాల్చిన వారిలోనే దీని సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు, డాప్లర్ స్కానింగ్ పరీక్షలు చేయించాలి. సమస్య తీవ్రతను బట్టి బిడ్డకు చికిత్స చేస్తారు.
News November 21, 2025
తులసికి సమర్పించకూడని నైవేద్యాలివే..

తులసి మొక్కపై లక్ష్మీ దేవి ఉంటారని నమ్ముతాం. అందుకే పూజలు చేస్తాం. అయితే ఈ దేవతకు కొన్ని నైవేద్యాలు సమర్పించడం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. శివ పూజకు వాడిన బిల్వ పత్రాలు, పారిజాత పూలు తులసికి సమర్పించకూడదట. చెరుకు రసం కూడా నిషిద్దమేనట. పాలు కలిపిన నీరు, నల్ల విత్తనాలు కూడా వద్దని సూచిస్తున్నారు. గణపతి పూజకు ఉపయోగించిన ఏ వస్తువునూ తులసికి సమర్పించకూడదనే నియమం ఉందంటున్నారు.
News November 21, 2025
మాజీ మంత్రి శైలజానాథ్కు మాతృవియోగం

శింగనమల వైసీపీ ఇన్ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తల్లి సాకే గంగమ్మ మృతి చెందారు. అనంతపురంలోని రామకృష్ణ నగర్లో నివాసం ఉంటున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో శైలజానాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు శైలజానాథ్ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


