News April 10, 2025
SRPT: త్వరలో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు

NLG రీజియన్‌కు ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. తొలిసారి కాలుష్య రహిత సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌లు రోడ్లపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ మార్పులు చేస్తూ ప్రయాణికులను పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఇంధనం ఖర్చు తగ్గించుకుని ఈ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. సూర్యాపేట డిపోకు 75 బస్సులు కేటాయించారు.
Similar News
News April 16, 2026
44.1 డిగ్రీలతో సెగలు గక్కుతున్న నల్గొండ

నల్గొండ జిల్లాలో ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. భానుడి భగభగలకు జిల్లా నిప్పుల కొలిమిలా మారగా, గుడిపల్లిలో అత్యధికంగా 44.1°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేవరకొండ, కట్టంగూరు వంటి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు వడగాల్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
News April 16, 2026
పెద్దల సభపై యనమల కన్ను.. అధినేత కరుణించేనా?

రాజ్యసభకు వెళ్లాలన్న తన మనసులో మాటను టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బయటపెట్టారు. జూన్‌లో ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో ఒకటైనా దక్కుతుందని ఆయన ఆశిస్తున్నారు. అయితే, సానా సతీశ్ పదవీకాలాన్ని పొడిగిస్తారన్న ప్రచారంతో యనమల అభ్యర్థిత్వంపై సందిగ్ధత నెలకొంది. ఇటీవల పొలిట్‌బ్యూరోలో చోటు దక్కించుకున్న ఆయనకు చంద్రబాబు పెద్దల సభ అవకాశం ఇస్తారో లేదోనని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
News April 16, 2026
NLG: రైతు భరోసాపై వీడని సందిగ్ధం

రైతు భరోసా రెండో విడత నిధుల జమపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 13 నుంచే నిధులు వేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో గత యాసంగి సీజన్‌లో మొదటి విడతగా ఎకరంన్నర లోపు భూమి ఉన్న రైతులకు రూ.268.57 కోట్లు జమ చేశారు. ఎకరాకు ఏడాదికి రూ.12 వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, నిధుల విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


