News April 13, 2025
SRPT: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: అ.కలెక్టర్

అనంతగిరి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని సూచించారు.
Similar News
News November 14, 2025
వ్యవసాయంలో ‘ఫర్టిగేషన్’ అంటే ఏమిటి?

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News November 14, 2025
‘ఫర్టిగేషన్’లో ఎరువులను ఎలా అందించాలి?

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.
News November 14, 2025
కిషన్ రెడ్డి సచివాలయానికి రావాలని ఆహ్వానిస్తున్నా: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కిషన్ రెడ్డి తానే స్వయంగా అభ్యర్థిగా మారినా డిపాజిట్ దక్కించుకోలేకపోయారని CM రేవంత్ ఎద్దేవా చేశారు. ‘భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కంపించి మనల్ని అలర్ట్ చేస్తుంది. మనం తేరుకోకపోతే భూగర్భంలో కలిసిపోతాం. ఇవాళ్టి ఫలితం BJPకి అలాంటి ఇండికేషనే. కిషన్ రెడ్డి తేరుకోవాలి. ఆయన సచివాలయానికి రావాలని రాష్ట్ర CMగా ఆహ్వానిస్తున్నా. మహానగరం అభివృద్ధికి సహకరించాలి’ అని కోరారు.


