News March 15, 2025

SRPT: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండ తీవ్రత పెరిగిన దృష్ట్యా శనివారం (నేడు) నుంచి సూర్యాపేట జిల్లాలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. పదో తరగతి ఎగ్జామ్స్ సెంటర్ స్కూల్స్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు హాఫ్‌ డే స్కూల్స్ ఉంటాయి. అటు ఈనెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Similar News

News November 18, 2025

మావోలకు మరో 4 నెలలే గడువు: బండి

image

TG: అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. హిడ్మా హతం సందర్భంగా ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామని, మరో 4 నెలలే ఉన్నందున నక్సల్స్ లొంగిపోవాలని పిలుపునిచ్చారు. బుల్లెట్‌ను కాకుండా బ్యాలెట్‌ను నమ్ముకోవాలని సూచించారు. కేవలం పోలీసులు, సైనికుల చేతుల్లోనే తుపాకులు ఉండాలన్నారు.

PGIMERలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

image

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (<>PGIMER<<>>) 5ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు రేపు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MDS,డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://pgimer.edu.in/