News March 8, 2025
SRPT: పంక్చర్లు వేస్తూ.. కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ..

25 ఏళ్లుగా పంక్చర్ షాపు నడుపుతూ తన ఇద్దరి కుమారుల చదువుకు ఆసరాగా నిలుస్తున్నారు తిరుమలగిరి మండలం వెలిశాలకు చెందిన గృహిణి బత్తిని పుష్ప. భర్త యాకయ్య గౌడ్ వృత్తికి తోడుగా కుటుంబ బాధ్యతలు పంచుకుంటూ పంక్చర్ షాపు చూసుకుంటున్నారు. లారీలు, ట్రాక్టర్లు, భారీ వాహనాలకు పంక్చర్లు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. స్వయం ఉపాధితో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఈ అమ్మ కథ ఎంతో మంది మహిళలకు ఆదర్శం.
Similar News
News January 25, 2026
KNR: పారదర్శకంగా ఇసుక విక్రయాలు.. అక్రమ రవాణాపై ఉక్కుపాదం!

కరీంనగర్ కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో TGMDC MD భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. ఇకపై ఇసుక బుకింగ్‌ను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, CP గౌస్ ఆలం సమక్షంలో తహశీల్దార్లకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో నిఘాపెంచి, అక్రమాలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా సరఫరా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
News January 25, 2026
TU: డిగ్రీ రివాల్యుయేషన్‌కు ఫిబ్రవరి 4 వరకు గడువు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 1, 3, 5 రెగ్యులర్ పరీక్షలు, 2, 4, 6 సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షల జవాబు పత్రాల రివాల్యుయేషన్‌కు ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ అఫ్ ఎక్సమినషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.
News January 25, 2026
సంజూకు ఇషాన్‌తో ముప్పు!

NZతో జరుగుతున్న T20 సిరీస్‌లో తొలి 2 మ్యాచుల్లో ఓపెనర్ శాంసన్ అనుకున్నస్థాయిలో రాణించలేదు. తొలి T20లో 10, రెండో దాంట్లో 6 పరుగులే చేశారు. ఇలాగే బ్యాడ్ ఫామ్ కంటిన్యూ చేస్తే మరో ఓపెనర్ అభిషేక్‌పై ఒత్తిడి పడే ఆస్కారముంది. దీంతో ఇవాళ శాంసన్ ఆశించిన మేర రన్స్ చేయకపోతే ఇషాన్‌తో రీప్లేస్ చేయొచ్చని క్రీడావర్గాలు భావిస్తున్నాయి. అతను కీపింగ్ కూడా చేయడం వల్ల సంజూకు మరింత ముప్పు పొంచి ఉందనే టాక్ నడుస్తోంది.


