News February 26, 2025
SRPT: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

గరిడేపల్లి మండలం గానుగబండ పంచాయతీ కార్యదర్శి ఇంద్రబాబును కలెక్టర్ తేజస్ నందన్ లాల్ సస్పెండ్ చేశారు. ఇటీవలే హుజూర్‌నగర్‌లో నిర్వహించిన భగీరథ నీటి సమీక్ష సమావేశంలో గానుగబండలో భగీరథ నీటి సరఫరా విషయమై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యదర్శి ఇచ్చిన వివరణలో పొంతనలేని సమాధానాలు ఉన్నాయని మంగళవారం అతణ్ని సస్పెండ్ చేశారు.
Similar News
News November 24, 2025
వారంలోగా సమస్యలు పరిష్కరించాలి: కాకినాడ ఎస్పీ

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 అర్జీలు వచ్చాయి. వీటిలో భూ తగాదాలు 10, కుటుంబ సమస్యలు 8, ఇతరత్రా 24 ఉన్నట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. అర్జీదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ అర్జీలను వారంలోగా పరిష్కరించాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలను ఎస్పీ ఆదేశించారు.
News November 24, 2025
వరంగల్: భారీగా పతనమవుతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్న ధర భారీగా పడిపోతోంది. గతవారం రూ.2,100 పలికిన మక్కలు ధర ఈవారం భారీగా తగ్గింది. నేడు మార్కెట్లో మొక్కజొన్న ధర రూ.1,970కి పడిపోయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే, మార్కెట్‌లో కొత్త తేజ మిర్చికి రూ.14,500 ధర రాగా.. దీపిక మిర్చికి సైతం రూ.14,500 ధర వచ్చింది.
News November 24, 2025
వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా కవిత బాధ్యతలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ నూతన డీసీపీగా దార కవిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆమెను.. సెంట్రల్ జోన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. డీసీపీ కవిత హైదరాబాద్ సైబర్ విభాగం పనిచేస్తూ బదిలీపై WGL సెంట్రల్ జోన్ డీసీపీగా నియమించబడ్డారు.


