News March 30, 2025
SRPT: పక్కింటి వారు తిట్టారని మహిళ సూసైడ్

పక్కింటి వారు తిట్టారని మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన వేల్పుకొండ మంజుల(42) పక్కింటి వారు తిట్టారినే కారణంతో శనివారం మధ్యహ్నం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంజుల కుమారుడు యాకస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
Similar News
News November 27, 2025
Viral: చిరంజీవితో కొండా సురేఖ సెల్ఫీ

TG: మెగాస్టార్ చిరంజీవితో మంత్రి కొండా సురేఖ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే మంత్రి సురేఖ.. బుధవారం జరిగిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య ఎంగేజ్మెంట్ ఫంక్షన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవితో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో చూసిన మెగాస్టార్ అభిమానులు.. ఆయన క్రేజ్ ఎప్పటికీ తగ్గదని కామెంట్స్ చేస్తున్నారు.
News November 27, 2025
జాతీయస్థాయి పోటీల్లో పెదబయలు EMRS విద్యార్థి సత్తా!

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల(EMRS) విద్యార్థులకు నిర్వహించిన జాతీయ స్థాయి వాల్యూ ఎడ్యుకేషన్ ఒలంపియడ్ పోటీల్లో పెదబయలు EMRS విద్యార్థి సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి 12 మంది విద్యార్థులు విజయం సాధించగా, AP నుంచి తమ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి కొర్ర గౌతమ్ 3వ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ అమిత్ ఆనంద్ తెలిపారు. గౌతమ్.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా బహుమతి తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
News November 27, 2025
‘పరకామణి’తో నాకు సంబంధం లేదు: YV సుబ్బారెడ్డి

తిరుపతి పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని YV సుబ్బారెడ్డి అన్నారు. ఈ అంశంపై రేపు విజయవాడలో CID విచారణకు హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అప్పన్న గతంలో తనకు PA మాత్రమే అని ఆ తర్వాత అతనితో తనకు సబంధం లేదని స్పష్టం చేశారు. TTD వ్యవహారంతో అప్పన్నకు సంబంధం లేదని, అదే విషయం సిట్కు చెప్పానన్నారు.


