News February 22, 2025
SRPT: ‘పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శనివారం కలెక్టరేట్లో DEO అశోక్‌తో కలిసి జిల్లాలోని హై స్కూల్ హెడ్ మాస్టర్లు, మండల విద్యాధికారులు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు.
Similar News
News December 2, 2025
పగిలిపోయిన దేవతా విగ్రహాలను పూజించవచ్చా?

పగిలిన దేవతా మూర్తుల విగ్రహాలు, చిరిగిన పటాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల భక్తి భావన తగ్గే అవకాశాలు ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘అలాంటి విగ్రహాలు, చిత్రపటాలను పారే నీటిలో నిమజ్జనం చేయాలి. లేకపోతే ఏదైనా దేవాలయం చెట్టు మొదలులో ఉంచాలి. కాగితపు పటాలు అయితే, వాటిని అగ్నికి ఆహుతి చేసి, ఆ బూడిదను నీటిలో కలిపి చెట్ల మొదట్లో పోయడం ఉత్తమ మార్గం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 2, 2025
ఇతిహాసాలు క్విజ్ – 84 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: ఐదు ముఖాల రూపం కలిగి, చిరంజీవిగా బ్రహ్మదేవునిచే వరం పొంది, యుద్ధంలో శారీరకంగా పాల్గొనకపోయినా ధర్మసంస్థాపనకు కారణమైంది ఎవరు?
సమాధానం: హనుమంతుడు. ఆయన పంచముఖుడు. చిరంజీవిగా బ్రహ్మదేవుడి వరం పొందాడు. యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో ప్రత్యక్షంగా ఆయుధం ధరించి పాల్గొనలేదు. కానీ, పరోక్షంగా, అత్యంత ముఖ్యమైన రీతిలో సహాయం అందించి, ధర్మసంస్థాపనకు కారణమయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 2, 2025
శబరి వెళ్లిన ప్రతి ఒక్కరూ 18 మెట్లు ఎక్కవచ్చా?

శబరిమలలో 18 పవిత్ర మెట్లను ముక్తికి సోపానాలుగా భావిస్తారు. ఇవి మనలోని 18 పాపపుణ్యాలు, విద్య, ఇంద్రియాలను సూచిస్తాయని నమ్మకం. వీటిని మండల కాల దీక్షా వ్రతం పూర్తిచేసినవారు మాత్రమే ఇరుముడి ధరించి, ‘స్వామియే శరణమయ్యప్ప’ అంటూ అధిరోహిస్తారు. దీక్ష ధరించకుండా, ఇరుముడి లేకుండా వచ్చిన భక్తులు ఈ మెట్లకు ప్రక్కన ఉన్న సాధారణ మెట్ల మార్గం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. <<-se>>#AyyappaMala<<>>


