News April 15, 2025
SRPT: పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.
Similar News
News November 28, 2025
నేడే రాజధానిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. దేశంలోని 15 ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటికి ఈ ఉదయం 11.22గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, CM CBN చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రూ.1,334 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆయా బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు, మంత్రులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.
News November 28, 2025
వనపర్తి: పంచాయతీ ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ నంబర్

వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08545-233525కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆమె తెలియజేశారు.
News November 28, 2025
రాష్ట్రస్థాయి క్రికెట్లో ఉమ్మడి ఖమ్మం జట్టు రన్నరప్

సంగారెడ్డిలో 3 రోజులుగా జరిగిన SGF రాష్ట్ర స్థాయి అండర్-19 బాలికల క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి ఖమ్మం జట్టు అద్భుత ప్రదర్శనతో ద్వితీయ స్థానం(రన్నరప్) సాధించింది. ఫైనల్ మ్యాచ్లో ఖమ్మం-HYD జట్లు తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన పోరులో చివరకు 6 పరుగుల స్వల్ప తేడాతో HYD జట్టు విజయం సాధించింది. ఖమ్మం జట్టు ప్రతిభావంతమైన ఆటతీరుతో రన్నరప్గా నిలవడంతో, జిల్లా క్రీడాకారులు, కోచ్లు అభినందనలు అందుకున్నారు.


