News June 3, 2024

 SRPT: భర్త మృతి, చెరువులో దూకి భార్య సూసైడ్ 

image

భర్తపై బెంగతో భార్య చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోతె మండల పరిధిలోని పేదరాజుతండాలో ఆదివారం జరిగింది. ఏఎస్ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. బానోతు రంగమ్మ(80) భర్త గత నెల 5వ తేదీన మృతి చెందారు. భర్తపై బెంగతో గ్రామ పరిధిలోని చెరువులో దూకి రంగమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు హంస్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News September 19, 2024

దేవరకొండ: ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యం

image

నల్గొండ జిల్లా దేవరకొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైనట్లు సీఐ నరసింహులు తెలిపారు. పాఠశాల గోడ దూకి పారిపోయిన విద్యార్థులు బుధవారం అర్ధరాత్రి చింతపల్లి మండలం మాల్ పట్టణంలో పోలీసులకు దొరికినట్టు తెలిపారు. విద్యార్థులను దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

News September 19, 2024

నల్గొండ: వృద్ధురాలిపై అత్యాచారం.. కేసు నమోదు

image

నల్గొండకి చెందిన 60 సంవత్సరాల వృద్ధురాలిని హిందూపూర్ స్మశాన వాటిక వద్ద కందుల కృష్ణ అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున అత్యాచారం చేశాడని వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ తెలిపారు. విషయం ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించి వెళ్లిపోయాడని తెలిపారు. బాధితురాలు కూతురితో విషయం చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News September 19, 2024

3 రోజుల్లో సాగర్ ఆయకట్టుకు సాగునీటి విడుదల

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎస్ఎల్బీసీ హై లెవెల్ కెనాల్‌కు సంబంధించిన నాలుగో పంపు మరమ్మతులు పూర్తయ్యాయని, 3 రోజుల్లో ఈ పంపు ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వి.అజయ్ కుమార్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు కాలువల్లో నీరు సమృద్ధిగా పారుతుందని రైతులెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.