News April 7, 2025
SRPT: మంచానికి సిగరెట్ అంటుకొని టీచర్ మృతి

సిగరేట్ మంచానికి అంటుకొని వ్యక్తి మృతిచెందిన ఘటన కోదాడ మండలం మంగళ్తండాలో జరిగింది. రూరల్ ఎస్ఐ అనిల్ వివరాలు.. తండాకు చెందిన బాలాజీ మద్యం మత్తులో సిగరెట్ తాగుతున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు మంచానికి మంటలు అంటుకొని బాలాజీ మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు ప్రస్తుతం కేశపురంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారన్నారు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News December 16, 2025
తిరుప్పావై కీర్తనలు ఆలపించే పద్ధతి

ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలను ఆలపిస్తే సుగుణాల భర్త వస్తాడని నమ్ముతారు. అయితే మొత్తం 30 పాశురాలు ఉంటాయి. రోజుకొకటి చొప్పున 30 రోజుల పాటు 30 పాశురాలను ఆలపించాలి. ఉదయాన్నే స్నానమాచరించి లక్ష్మీనారాయణులను పూజించాక ఈ పాశురాలను ఆలపించాలి. గోదాదేవి శ్రీకృష్ణుడిని మేల్కొలపడానికి తన చెలులతో కలిసి వీటిని ఆలపించింది. ధనుర్మాసంలో తిరుమలలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై కీర్తనలే ఆలపిస్తారు.
News December 16, 2025
లంపీస్కిన్ నివారణకు మరో ఆయుర్వేద మందు

ఆయుర్వేద మందుతో <<18552983>>లంపీస్కిన్<<>> నుంచి పశువును కాపాడవచ్చు. రెండు వెల్లులి రెబ్బలు, 10గ్రా. ధనియాలు, 10గ్రా. జీలకర్ర, గుప్పెడు తులసి ఆకులు, 10గ్రా. బిర్యానీ ఆకులు, 10గ్రా. మిరియాలు, 5 తమలపాకులు, రెండు ఉల్లిపాయలు, 10 గ్రా. పసుపు, 10గ్రాముల వాము, గుప్పెడు తులసి ఆకులు, గుప్పెడు వేపాకులు, గుప్పెడు బిల్వపత్రం ఆకులు, 10గ్రాముల బెల్లం తీసుకొని వీటిని మిశ్రమంలాగా చేసి వారం రోజుల పాటు రోజుకు ఒకసారి తినిపించాలి.
News December 16, 2025
ఇంటర్ సెకండియర్ పరీక్షల తేదీలో మార్పు

TG: ఇంటర్ సెకండియర్ పబ్లిక్ పరీక్షల <<18157878>>షెడ్యూల్లో<<>> స్వల్ప మార్పు జరిగింది. మార్చి 3న జరగాల్సిన పరీక్షలను 4వ తేదీకి వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. 4న హోలీ పండుగ ఉంటుందని భావించి షెడ్యూల్లో 3వ తేదీన పరీక్ష ఉంటుందని ప్రకటించారు. కానీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సెలవుల జాబితాలో 3న హోలీ పండుగ సెలవు ఉంది. దీంతో ఈ మార్పు చేశారు. అటు ఫిబ్రవరి 2 నుంచి 3 విడతల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.


