News January 29, 2025

SRPT: మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా!

image

SRPT జిల్లాలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేదని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలానికి తెరపడిన విషయం తెలిసిందే. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మరో ఆరు నెలలు లేదా ఏడాది పాటు ప్రత్యేక పాలన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 4, 2025

11వ తేదీ కడప మేయర్ ఎన్నిక జరగకపోతే?

image

కడప మేయర్ ఎన్నికకు <<18470673>>నోటిఫికేషన్<<>> విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఒకవేళ 11వ తేదీ ఎన్నిక జరగకపోతే.. రిజర్వ్ డే (12వ తేది)న ఎన్నిక ఉంటుందని స్పష్టం చేశారు. అప్పటికీ ఎన్నిక జరగకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తర్వాతి తేదీని వెల్లడిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News December 4, 2025

ఖమ్మం: ఏపీ సీఎం సతీమణి వాహానం‌ తనీఖీ

image

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికారులు తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా నాయికన్ గూడెం చెక్ పోస్టు వద్ద ఏపీ సీఎం‌ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వాహనాన్ని తనీఖీ చేశారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఆమె వాహనాన్ని తనీఖీ చేశారు. ఆమె వెళ్తున్న వివరాలను అధికారులు నోట్ చేసుకున్నారు.

News December 4, 2025

ADB: అధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి

image

గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం జిల్లా అధికారులతో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సమావేశం నిర్వహించారు. ఆర్వో స్టేజ్ 2 జోనల్ అధికారులు వెంటనే పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రోడ్డు మార్గాలను పరిశీలించాలని వివరించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు.