News November 5, 2024

SRPT: యువకుడి ఆత్మహత్య

image

కోదాడ మండలం కూచిపూడి తండాలో సాయి భగవాన్ అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విషయంలో మాట్లాడదామని పిలిచి యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారని యువకుడి బంధువులు ఆరోపించారు. అవమాన భారం తట్టుకోలేక పురుగుల మందు తాగి సాయి భగవాన్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 1, 2025

శిశు విక్రయాలు, లైంగిక దాడులపై కఠిన చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

నల్గొండ జిల్లాలో ఆడబిడ్డల రక్షణకై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శిశు విక్రయాలు, బాల్య వివాహాలు, హాస్టల్ విద్యార్థినులపై లైంగిక దాడులు వంటి వాటిని అరికట్టడంలో అన్ని సంక్షేమ శాఖలు, ఆర్.సీ.ఓ.లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ దుశ్చర్యలకు పాల్పడితే సంబంధిత శాఖల అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 1, 2025

చిన్నసూరారం ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

నల్గొండ మండలం చిన్నసూరారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకుండా సీరియల్ ప్రకారం కాంటాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం తడవకుండా ఎప్పటికప్పుడు తూకాలు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన లారీలు, బస్తాలు, పట్టాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

News November 1, 2025

NLG: ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశాం: కలెక్టర్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో నల్గొండ జిల్లాలోని 10 మండలాల పరిధిలో కొంతమేరకు తడిసిన వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 4,600 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసినట్లు పేర్కొన్నారు.