News March 20, 2025
SRPT: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ఆహ్వానం

SRPT జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 5 వరకు http://tgobmmsnew.cgg.gov.inలో అప్లై చేసుకుంటే అర్హులైన వారి జాబితాను జూన్ 02న ప్రకటించి, ఒక్కొక్క నియోజకవర్గాలలో సుమారు 4 నుంచి 5వేల యూనిట్లు మంజూరు చేయనున్నారు అని అన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లో సంప్రదించాలన్నారు.
Similar News
News November 17, 2025
NRPT: ‘ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి’

నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంచిత్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 22 అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు ఆయన సూచించారు.
News November 17, 2025
సత్వర న్యాయం అందించడమే లక్ష్యం: ఎస్పీ

ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకే పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 58 అర్జీలు అందగా, వాటిలో 13 భూతగాదాలు, 18 కుటుంబ కలహాలు, 27 ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి. ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్.హెచ్.ఓ.లకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
News November 17, 2025
బెల్లం.. మహిళలకు ఓ వరం

నిత్యం ఇంట్లో, బయట పనులను చేస్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా కాకూడదంటే బెల్లాన్ని తమ డైట్లో చేర్చుకోవాల్సిందే. శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. బరువును తగ్గించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు.


