News April 12, 2025
SRPT రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, పోలీస్ స్టేషన్ నిర్వహణ, పరిసరాలు, ఫిర్యాదుల నిర్వహణ, రిసెప్షన్ మేనేజ్మెంట్ మొదలైన అంశాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఫిర్యాదులపై సత్వరం స్పందించి సేవలు అందించాలని చెప్పారు. SI బాలు నాయక్, సిబ్బంది ఉన్నారు.
Similar News
News April 17, 2025
కడప జిల్లా లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నిక

కొండాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న జి.రామకృష్ణారెడ్డి కడప జిల్లా లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. కడప పట్టణంలోని STUAP భవనంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గురువారం ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కొండాపురం కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లు జయాకర్, రవికుమార్, మహబూబ్ బాషా, వేణుగోపాల్, ప్రిన్సిపల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
News April 17, 2025
మేడ్చల్: 5నెలలుగా జీతాలు లేవని కార్మికుల వినతి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గ్రామపంచాయతీలలో పని చేస్తున్న కార్మికులకు గత 5 నెలలుగా జీతాలు రావడంలేదని సీఐటీయూ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్‌ఛార్జి డీపీవో సాంబశివరావుకు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు 5 నెలల నుంచి జీతంఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి ఉన్నికృష్ణ, సుధాకర్, ప్రశాంత్ ఉన్నారు.
News April 17, 2025
స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు సరికొత్త ఊపు: కలెక్టర్

స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్‌తో సరికొత్త ఊపు రానుందని ఈ హబ్‌తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లో టాటా ఇన్నొవేషన్ హబ్-స్పోక్‌పై సమావేశం నిర్వహించగా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ప్రత్యేక అధికారి దీప్తిరావు, సమన్వయ శాఖల అధికారులు హాజరయ్యారు.