News February 10, 2025

SRPT: రేపు ముసాయిదా జాబితా విడుదల

image

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. SRPT జిల్లాలో 23 ZPTCలు, 232 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

Similar News

News December 6, 2025

రెండో విడత ఎన్నికలు.. నేడు గుర్తులు కేటాయింపు.!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు ఆయా కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు ఈరోజు గుర్తులు కేటాయించనున్నారు. అటు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఇప్పటికే రెబల్స్ బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేయించే పనిలో నిమగమయ్యారు. కాగా గుర్తుల కేటాయింపు అనంతరం ఎన్నికల ప్రచారం ముమ్మరం కానుంది.

News December 6, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} నేడు ఖమ్మం, మధిర, చింతకాని మండలాల్లో పవర్ కట్
∆} నేడు ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ
∆} నేడు ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

News December 6, 2025

సత్తుపల్లి: అక్రమ వేట.. మాజీ MLA సోదరుడి కుమారుడి అరెస్టు

image

సత్తుపల్లిలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ వేట కార్యకలాపాలపై టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించి నలుగురిని అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు రఘు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం పట్టుబడిన రఘు, మరో నిందితుడు కుంజా భరత్‌లను కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు ఉంటాయని DFO హెచ్చరించారు.