News February 10, 2025
SRPT: రేపు ముసాయిదా జాబితా విడుదల

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. SRPT జిల్లాలో 23 ZPTCలు, 232 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.
Similar News
News March 17, 2026
NLG: గ్యాస్ కొరతతో సామాన్యులకు కష్టాలు

నల్గొండ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ధరల పెరుగుదలతో పాటు సరఫరా లోపం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వంటగదుల్లో గ్యాస్ లేక వంట చేయడం కష్టంగా మారింది. జిల్లాలో సుమారు 6 లక్షల వినియోగదారులున్నారు. ఈ నెల 13న బుక్ చేసిన సిలిండర్లు ఇంకా అందలేదు. ఈ పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సరఫరా మెరుగుపరచాలని కోరుతున్నారు.
News March 17, 2026
VJA: మృత్యుపాశంలా రహదారులు.. 2 రోజుల్లో నలుగురి మృతి!

విజయవాడలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ బైపాస్ వద్ద ప్రొఫెసర్, ఎనికేపాడులో వృద్ధుడు, నున్నలో ఒక యువకుడితో పాటు, మహానాడు రోడ్డులో వాచ్‌మెన్ దుర్మరణం చెందారు. మితిమీరిన వేగం, అజాగ్రత్తే ఈ విషాదాలకు కారణమని తెలుస్తోంది.
News March 17, 2026
గద్వాల: రైలు ఆలస్యం.. ముగ్గురు విద్యార్థుల జీవితాల్లో విషాదం

గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో <<19404491>>ఆర్టీసీ బస్సు, బైక్‌ను ఢీకొన్న ఘటన<<>>లో ముగ్గురు విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. అయిజకు చెందిన రాము(17) అక్కడికక్కడే మృతి చెందాడు. మిట్టదొడ్డికి చెందిన విష్ణు, గంజిపేటకి చెందిన వర్ధన్ తీవ్ర గాయాలు కావడంతో వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వెళ్లేందుకు రైలు టికెట్లు తీసుకున్న వీరు.. రైలు ఆలస్యంతో బైక్‌పై బయటికి రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


