News July 19, 2024
SRPT: రేపే బదిలీ.. అంతలోనే ఏసీబీకి చిక్కాడు

సూర్యాపేట జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉదయం నుంచి ఆ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. గతంలో సదరు అధికారి రెండు సార్లు ఏసీబీకి పట్టుబడినట్లు తెలుస్తోంది. రేపు సూర్యాపేట నుంచి బదిలీ కావాల్సి ఉండగా అంతలోనే ఏసీబీ అధికారులు పట్టుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News September 18, 2025
నల్లగొండ : పత్తి కొనుగోలుకు సన్నాహాలు

పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఈసారి 5,67,613 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా సుమారు 4,54,090 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 7పత్తి కేంద్రాల కింద 24 పత్తి మిల్లులు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిపై చేయనున్నారు.
News September 18, 2025
ఈనెల 20న నల్గొండలో జాబ్ మేళా

నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించుటకు ఈనెల 20న ఉదయం 10-30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయములో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎంపిక కాబడిన వారు నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పనిచేయవలసి ఉంటుందని తెలిపారు.
News September 18, 2025
NLG: పత్తికి క్వింటాకు రూ.8110లు మద్దతు ధర

ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అండగా నిలిచేందుకు అడిషనల్ కలెక్టర్ ఇవాళ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 7 పత్తి కేంద్రాల కింద 24 సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పత్తికి క్వింటాకు రూ.8110లు మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలిపారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో 8 నుంచి 12 శాతం లోపు తేమశాతం కలిగి నాణ్యమైన పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.