News April 4, 2024
SRPT: ‘రైతులతో వెళ్లి సాగర్ గేట్లు బద్దలు కొడతాం’

జిల్లాలోని అన్ని గ్రామాల చెరువులను సాగర్ నీటి ద్వారా నింపాలని, నీరు వదలక పోతే నేరుగా రైతులతో వచ్చి గేట్లు బద్దలు కొడతామని నల్లగొండ పార్లమెంట్ BJP ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. గురువారం సాగర్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని పరిశీలించి మాట్లాడారు. నీరు లేక గ్రామాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం గ్రామాలలో చెరువులను నింపాలన్నారు.
Similar News
News September 18, 2025
నల్లొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక ఆదేశాలు

పెండింగ్‌లో ఉన్న సదరం కేసులను వచ్చే నెలలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డీఆర్డీవో శేఖర్ రెడ్డిని ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరాన్ని సందర్శించారు. పార్టిషన్ పనులు పూర్తయ్యాక, సదరం క్యాంపులను ఆసుపత్రి నూతన భవనంలో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న 2,564 సదరం దరఖాస్తులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
News September 18, 2025
NLG: ఇంటర్ ఫలితాలు తిరోగమనం…!

ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా తిరోగమనం వైపుగా పయనిస్తోంది. మూడేళ్లుగా జిల్లాలో ఫలితాలు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలువగా.. ఈ సారి మాత్రం ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 12వ స్థానానికి పడిపోయింది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు యంత్రాంగం దృష్టి సారించాలని పేరెంట్స్ కోరుతున్నారు.
News September 18, 2025
ఎంజీయూలో వివిధ విభాగాలకు నూతన అధిపతుల నియామకం

మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి డా. ఎం.జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి డా. జి.ఉపేందర్‌రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి డా. శాంత కుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్)గా డా. ఆర్.రూప నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఆయా విభాగాలకు అధిపతులుగా వ్యవహరిస్తారు.