News February 1, 2025
SRPT: విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్

విద్యార్థులు ఉన్నత ఆశయంతో చదివి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పరిధిలోని ఇమంపేట ఆదర్శ పాఠశాలను సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజన నాణ్యతను, మెనూ పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, అధికారులు ఉన్నారు.
Similar News
News October 18, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిపై రంగారెడ్డి కలెక్టర్ సమీక్ష

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన పురోగతి సాధించాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో ఇబ్రహీంపట్నంలోని కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. మండలాల వారీ మంజూరైన ఇళ్ల సంఖ్య, గ్రౌండింగ్, నిర్మాణ దశల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెనుకంజలో ఉన్న మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 18, 2025
విజయవాడలో ఏసీబీకి పట్టుబడిన అటెండర్

విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ శాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన అవినీతి తిమింగలం కొండపల్లి శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. గవర్నర్పేటలో అటెండర్గా పనిచేసే శ్రీనివాస్, వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులందాయి. ఓ ట్రాన్స్పోర్టు యజమాని వద్ద రైడ్స్ సాకుతో నగదు వసూలు చేస్తుండగా, ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు బృందం వలపన్ని పట్టుకుంది.
News October 18, 2025
ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెళ్లికి ముందే కౌన్సెలింగ్

TG: వివాహబంధాల్లో పెరుగుతున్న ఘర్షణలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 33 జిల్లాల్లో ఇప్పటికే ఉన్న సఖీ, వన్ స్టాప్ కేంద్రాల్లో రూ.5 కోట్ల వ్యయంతో వీటిని పెట్టనుంది. ప్రతి సెంటర్లో లీగల్ కౌన్సెలర్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్, హెల్పర్ ఉంటారు. వివాహబంధంలోకి అడుగుపెట్టాలనుకునే వారు వీటిల్లో కౌన్సెలింగ్ తీసుకోవచ్చు.