News April 1, 2025
SRPT: సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: ఎస్పీ

సైబర్ నేరాలపై యువత అప్రమత్తత, అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడం, ఉచితంగా బహుమతులు పొందడం, మన ప్రమేయం లేకుండా ఏదైనా వస్తుంది అంటే దాని వెనుక సైబర్ మోసగాళ్లు ఉన్నారని గ్రహించాలని తెలిపారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
Similar News
News November 20, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 10

56. స్నానం అంటే ఏమిటి? (జ.మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? (జ.సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? (జ.ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (జ.ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు)
60. ఏది కాయం? (జ.సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 20, 2025
APPLY NOW: NRDCలో ఉద్యోగాలు..

న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(<
News November 20, 2025
KMR: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: DTU

సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు TET నుంచి మినహాయింపు ఇవ్వాలని ధర్మా టీచర్స్ యూనిటీ (DTU) కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కోరారు. గురువారం కామారెడ్డిలో వారు సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, డీఏ తక్షణమే చెల్లించాలన్నారు. గత సంవత్సరం ఉపాధ్యాయులు నిర్వహించిన కులగణన రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరారు.


